16 April, 2026 | 3:27 AM

ఫ్యాక్టరీ పక్కన పాఠశాలా?

16-04-2026 01:58 AM
  1. నియోజకవర్గంలో ధమాగ్నపూర్‌లోనే చోటు ఉందా 
  2. విద్యార్థులకు ఉపయోగపడాల పాఠశాల ఏర్పాటు చేయాలి 
  3. వ్యక్తిగత ఏ జెండాలతో.. సరికాదు అంటున్న జనం
  4. భవిష్యత్తు తరాలు బాగుండాలన్నదే మా సంకల్పం : బసిరెడ్డి సంతోష్ రెడ్డి, స్థానికులు

చిన్న చింత కుంట, ఏప్రిల్ 15 : అభివృద్ధి జరుగుతుందంటే ఎవరు కోరుకోరు... సాదరంగా ఆహ్వానం పలుకుతూ మీరే మాకు ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉండాలంటూ ఆశీర్వాదాలు సైతం జనం ఇస్తుంటారు. కాగా దేవ రకద్ర నియోజకవర్గం లో ఎమ్మెల్యే సొంత గ్రామమైన దమగ్నపుర్ గ్రామంలో ఇటీవల మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంతో జనం నుంచి మిశ్రమ స్పందన వస్తుంది.

ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ పక్కన ఎంతో చారిత్రాత్మక నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నూతన పాఠశాల భవనాన్ని నిర్మించడం సరికాదంటూ జనం ఆసహనం వ్యక్తం చేస్తూ ధర్నాలు సైతం చేస్తుండ్రు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో పాఠశాల నిర్మించకూడదని మరేదైనా ఇతర ప్రాంతంలో అందరికీ ఉపయోగపడేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు చెబుతు న్న మాట. ఇతనాల్ కెమికల్ ఫ్యాక్టరీ పక్కనే 25 ఎకరాల్లో ప్రణాళికపై ఆందోళన వ్యక్తం చేస్తుండ్రు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో పట్టించుకోవాలని ఈ విషయంపై పునరాలో చించాలని జనం కోరుతుండ్రు.

భవిష్యత్తులో విద్యార్థులకు ఇబ్బంది...

కెమికల్ ఫ్యాక్టరీకు కూతవేటు దూరంలో రవాణా సౌకర్యాలు లేని చివరి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేస్తే విద్యార్థుల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.క్వారీల ఏర్పాటు సమయంలో ప్రజాభిప్రాయం సేకరణ చేస్తే, వేలాది పిల్లల భవిష్యత్తు విషయంలో ఎం దుకు చేయరు ? అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. స్కూల్ చుట్టుపక్కల గాలిలో కలి సే రసాయన కాలుష్యం, భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ముందుగా అఖిలపక్ష ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఒక్క క్షణం ఆలోచించండి 

 ఫ్యాక్టరీ పక్కన పొల్యూషన్ ఉండే ప్రాంతంలో సరియైన రా కపోకలకు ఇబ్బందులు ఉండే ప్రాంతం లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పా టు చేయ డం వల్ల తీర ఇబ్బందులు అవకాశం ఉంది. ఇటువంటి కీలక విషయంలో ఎంపీకి వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదు.పేద పిల్లల చ దువులతో వారి ఆరోగ్యాలతో రాజకీయాలు ఆడితే ఊరుకోమని. 2500 మంది విద్యార్థు లు, వారికి బోధించే ఉపాధ్యాయులు, పనిచేసే సిబ్బంది అనారోగ్యానికి గురయ్యే ప్ర మాదం ఉన్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే, దేవరకద్ర అధికారులు, కలెక్టర్ లకు పిర్యాదు చేసిన ఫలితం  ఏమిలేదు.

ప్రజల సొమ్ముతో నిర్మించే స్కూల్, ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి గాని, ఎవరి సొంత భూముల విలువ పెంచడానికోసం కాదు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోనే ఇంటిగ్రేటెడ్ స్క్పూ ఓపెన్ చర్చ పెట్టండి. జనం మాట అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. 

బసిరెడ్డి సంతోష్ రెడ్డి, చిన్న చింత కుంట మండలం, మహబూబ్ నగర్