14-12-2025 01:13:27 AM
గబ్బర్ సింగ్’ తర్వాత హీరో పవన్‌కళ్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైతీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘దేఖ్‌లేంగే సాలా’ విడుదలైంది. ఈ గీతావిష్కరణ కార్యక్రమం శనివారం రాజమండ్రిలో జరిగింది. దర్శకుడు హరీశ్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, నిర్మాత నవీన్ యెర్నేని, గీత రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.
‘రంపంపం రంపపం.. స్టెప్పేస్తే భూకంపం.. ధమ్ ధమ్ ధమ్ రిథమ్ ధమ్.. జోరుమీద హోరుగాలి రప్పిద్దాం.. బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా.. రే ఆఫ్ హోపే తగ్గుతున్నా.. థగ్ ఆఫ్ వారే జరుగుతున్నా.. టేకాప్ లేటయ్యినా.. దేఖ్‌లేంగే సాలా.. చూసినాం లే చాలా..’ అంటూ సాగుతోందీ గీతం. దేవిశ్రీ స్వరపర్చిన ఈ గీతానికి భాస్కరభట్ల రాసిన సాహిత్యం అందించగా విశాల్ దద్లానీ ఆలపించారు.