calender_icon.png 14 December, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12న వస్తున్నారు!

14-12-2025 01:14:56 AM

మెగాస్టార్ చిరంజీవి మాస్ -అండ్ -ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలకమైన ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు.

పూర్తి షూటింగ్ షెడ్యూల్స్‌ను ముగించుకొని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోందీ చిత్రం. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఆరంభం నుంచే చెప్తూ వస్తోంది టీమ్. అయితే, సంక్రాంతికి రెండు రోజుల ముందు.. అంటే జనవరి 12న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేటర్లలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం శనివారం ప్రక టించింది.

ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్‌లో రెడ్‌కార్‌పై బ్లాక్ సూట్‌లో కాఫీ తాగుతూ మెగా స్వాగ్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు చిరంజీవి. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: సమీర్‌రెడ్డి; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు.