calender_icon.png 26 August, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ సప్లై గోదాం ఇన్చార్జ్ గంగాధర్ రాజుకు ఘన వీడ్కోలు

26-08-2025 11:26:58 AM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల సివిల్ సప్లై గోదాం ఇన్చార్జిగా సేవలందించిన గంగాధర్ రాజు బదిలీపై వెళ్తుండగా సోమవారం హమాలీలు, గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. 16 రేషన్ షాపులకు, 7 మండలాలకు సకాలంలో బియ్యం సరఫరా చేసి కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా "ఉత్తమ ఉద్యోగి" అవార్డు అందుకున్న ఆయనను విడిచి పెట్టడం బాధాకరమని హమాలీలు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం శాలువాతో సత్కరించి వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలి మేస్త్రి సరిగోమ్ముల సురేష్, బండారి మధుకర్, కట్కూరి కుమార్, శీలపాకు నాగరాజు, గుర్రం నాగేంద్ర బాబు, ముత్యాల మొగిలి,కట్కూరి హరీష్, ఆరెపల్లి వినోద తదితరులు పాల్గొన్నారు.