26-08-2025 11:29:13 AM
బిజెపి జిల్లా నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి..
చిట్యాల (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని బిజెపి జిల్లా నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి(BJP District Constituency In-charge Chandupatla Keerthi Reddy) అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి హామీలను అమలు చేయాలని తహశీల్దార్ కు వినతిపత్రం అదజేశారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ, చిట్యాల మండల కేంద్రం నుండి తరలించిన అంగన్వాడి సెంటర్ ను తిరిగి తీసుకురావాలని కోరారు. నాపాక ఆలయానికి అధిక నిధులు వెచ్చించి అభివృద్ధి చేయాలని, వరికోల్ పల్లి, కుమ్మరీ పల్లి రైతులకు చెందిన పట్టాలను వెంటనే అందించాలన్నారు. రైతు వేదిక దగ్గర శంకుస్థాపన చేసిన సురభి కాంప్లెక్స్ ను చౌరస్తాలో నిర్మించాలని కోరారు.
చిట్యాల మండల కేంద్రంలో ఇవన్నీ సమస్యలు పెట్టుకొని అభివృద్ధి అంటున్నటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి మీరు చూపిస్తారా అని సవాల్ విసిరారు.ఇప్పటికైనా సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య,బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ నాగపురి రాజమౌళి గౌడ్,లింగంపల్లి ప్రసాద్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికిరణ్,పెండెల రాజు ,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె శేషి, దేశెట్టి గోపాల్, మైదం శ్రీకాంత్, చెక్క నరసయ్య, చింతల రాజేందర్ అనుప మహేష్ తదితరులు పాల్గొన్నారు.