26-08-2025 01:16:45 PM
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన ప్రవాస భారతీయ(ఎన్నారై) శ్రీ పైల్ల వెంకట్ రెడ్డి-శ్రీమతి పైల్ల శామిని రెడ్డి దంపతుల కుమారులు శ్రీయంశ్ రెడ్డి, ఆరుష్ రెడ్డిల ధోతీ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జి.ఎస్.ఆర్ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కంచ ఐలయ్య, గాదె ఇన్నయ్య, జక్క వెంకట్ రెడ్డి, రేగతి మల్లికార్జున రెడ్డి, పైల్ల రాజవర్ధన్ రెడ్డి తదితరులు విచ్చేసి ఆశీస్సులు అందించారు. పైళ్ల కుటుంబ స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.