calender_icon.png 26 August, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా పెన్షన్ల పంపిణీ

26-08-2025 01:24:26 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

బిపిఎంలకు మొబైల్స్ అందజేత..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలసి బ్రాంచ్ పోస్టల్ ఆఫీసర్స్(బిపిఎం) లకు మొబైల్స్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మరింత పారదర్శకంగా చేపట్టేందుకు మొబైల్స్ అందజేసిందని తెలిపారు. మొబైల్ లో ప్రత్యేకంగా యాప్ ఉంటుందని పెన్షన్ దారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందన్నారు. ప్రతినెల పెన్షన్ దారులకు ఐరిస్, వేలిముద్ర ద్వారా పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ దత్తారావు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.