26-08-2025 01:36:58 PM
మైనర్ బాలికపై అత్యాచారం..
నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు(POCSO Court) మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో తిప్పర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యూంను కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడికి 51 ఏళ్ల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోజా రమణి తీర్పు ఇచ్చింది. అత్యాచార కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసులో 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ కేసులో పదేళ్ళు, సెక్షన్ 506(మైనర్ బాలికపై బెదిరింపులు) కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు వెల్లడించింది. 2021లో తిప్పర్తి పీఎస్ పరిధిలో దళిత మైనర్ బాలికపై మహమ్మద్ ఖయ్యూం మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharath Chandra Pawar) నేతృత్వంలో న్యాయస్థానికి సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ సమర్పించడంతో నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోలేక పోయాడు.