తల్లిదండ్రులకు గుడి కట్టించిన కొడుకు
26-05-2024 01:32 AM
నర్సాపూర్, మే 25 : కన్న తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి వారి పేరిట తన వ్యవసాయ పొలంలో ఆలయం నిర్మించి తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చాటాడు ఓ ప్రముఖ డాక్టర్. వివరాలలోకి వెళితే మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని రుస్తుంపేట గ్రామానికి చెందిన ప్రముఖ హోమియోపతి వైద్యుడు డాక్టర్ బస్వానందం తన పొలంలో వారి తల్లిదండ్రుల పెంటమ్మ, ఈశ్వరప్పల విగ్రహాలను పాలరాతితో ప్రత్యేకంగా తయారు చేయించారు. అయితే ఈ నెల 26వ తేది నుంచి ఆలయ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించేందుకు డాక్టర్ బస్వానందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ ఉత్సవాలకు గౌరవ అతిథిలుగా గిరిమహరాజ్‌స్వామి (బర్దీపూర్), రాజయోగి వెంకటస్వామి రుస్తుంపేట గార్లు అదే విధంగా ప్రజాప్రతినిధులను కలిసి ఆహ్వానించాడు.






