18 July, 2026 | 4:23 AM

జుక్కల్ నియోజవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి

25-09-2025 12:18 AM

ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

బిచ్కుంద, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి): జుక్కల్ నియోజవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర గ్రామీ ణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమైందని, అభివృద్ధి దిశగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రమంత్రిని అభ్యర్థించారు.

జుక్కల్ నియోజకవర్గానికి స్వయంగా వచ్చి పరిస్థితులను పరిశీలించాలని ఆహ్వానించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్  సానుకూలంగా స్పందించి, త్వరలోనే నియోజకవర్గాన్ని సందర్శిస్తానన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిం చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అంతేకాక, జుక్కల్ నియోజకవర్గానికి మూడు బిఎస్‌ఎన్‌ఎల్ టవర్స్‌ను మంజూరు చేస్తానని ప్రక టించారు. ఇది జిల్లాలో టెలికాం కనెక్టివిటీ మెరుగుపరచడంలో కీలకంగా నిలవనుంది. జుక్కల్ అభివృద్ధికి తన యొక్క పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ భేటీలో ఎన్నారై ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు  బుజం భాస్కర్ రెడ్డి  వున్నారు.