calender_icon.png 25 September, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపపిల్లల పంపిణీలో ఆలస్యం.. నష్టపోతున్న మత్స్యకారులు

25-09-2025 12:17:10 AM

పూర్తికాని టెండర్ల ప్రక్రియ పట్టించుకోని ప్రభుత్వం 

సిద్ధిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 24:సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క చెరువులో చేప పిల్లల పంపిణీ జరగలేదు. దాంతో మ త్స్య కారులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా నష్ట పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నా యి. చేప పిల్లల పంపిణీ పై సిద్దిపేట మత్స్య శాఖ జిల్లా అధికారి మల్లేశంతో విజయక్రాంతి ఇంటర్వ్యూ.

ప్రశ్న: సిద్దిపేట జిల్లాలో ఎన్ని చెరువులు,కుంటలు ఉన్నాయి ?

జవాబు: జిల్లాలో 1728 చెరువులు,కుంటలు,ప్రాజెక్ట్ లు ఉన్నాయి. 

ప్రశ్న: చేప పిల్లల పంపిణీకీ టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందా ?

జవాబు: జిల్లాలో చేప పిల్లల పంపిణీ కీ 2 టెండర్లు వచ్చా యి వారు సరఫరా చేస్తారా లేదా అనేది ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ఈ వారం రోజులలో టెండర్లు పూర్తి అయే అవకాశం ఉన్నది.

ప్రశ్న: సిద్దిపేట జిల్లాలో పంపిణీకీ ఎన్ని చేప పిల్లల అవస రం ఉన్నది ? గత సంవత్సరములో ఎన్ని చేప పిల్లలు పంపిణీ చేశారు ?

జవాబు: జిల్లాలో 4.42 కోట్ల చేప పిల్లల అవసరం ఉన్నది. గత సంవత్సరములో 12 లక్షల 34 వేల చేప పిల్లలు 25 చెరువుల్లో పంపిణీ చేశాము.

ప్రశ్న: మన జిల్లాలో ప్రధానంగా ఏ రకాల చేపలు పెంచుతారు ?

జవాబు: జిల్లాలో రవ్వు, బొచ్చ, మేఘాల,బంగారుతీగ ప లు రకాల చేపలు పంపిణీకీ సరఫరా చేస్తాము.

ప్రశ్న: చేప పిల్లల పంపిణీ కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా వద్దని మత్స్య సహకార సంఘాలు అంటున్నాయి ? సంఘాల ద్వారా చేప పిల్లలు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయ ?

జవాబు: ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల ద్వా రనే పంపిణీ చేయాలనే నిబంధన ఉన్నది.

ప్రశ్న: జిల్లాలో ఉన్న ప్రాజెక్టులలో అనుమతి లేకుండా చేప ల వేటకు వెళ్లే వారిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ?

జవాబు: జిల్లాలో అన్నీ చెరువులు,కుంటలు మొత్తం పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున ఈత రాని వారు చేపల వేటకి వెళ్ళి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.