calender_icon.png 25 September, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

25-09-2025 12:18:36 AM

ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి

హైదరాబాద్, సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి ): తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలు సికింద్రాబాద్‌లో వైభవంగా జరిగాయి. జీహెఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ పరిధి లోని స్వయం సహాయక సంఘాల మహిళలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రాం గణం సందడిగా మారింది.

రంగురంగుల పూలతో అద్భుతంగా తీర్చిదిద్దిన బతుకమ్మ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి సాంప్రదాయ గీతా లు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ ఉత్సవాలకు కళ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉత్తమంగా నిలిచిన బతు కమ్మలకు డిప్యూటీ మేయర్ బహుమతులు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను అభినందించి, ప్రోత్సాహక బహుమతులు అందించారు.

అనంతరం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ పండు గ మన తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, మహిళల ఐక్యతకు నిదర్శనం. మన సాంప్రదాయ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడంలో ఈ ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయి. మహిళల ప్రతిభను వెలికితీసే ఇలాంటి వేదికలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమి షనర్ ఆంజనేయులు, డీపీఓ శ్రీనాథ్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.