కన్నుల పండుగగా ఫలహారం బండి ఊరేగింపు
13-08-2026 01:42 AM
పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, ఆగస్టు 12 (విజయక్రాంతి): బ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బోనాల వేడుకల్లో భాగంగా ఫలారం బండి ఊరేగింపులు కన్నుల పండుగగా జరిగాయి. రహ్మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, మాదాపూర్, పాండురంగనగర్ ప్రాంతాల్లో బుధవారం జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు. అ మ్మవారి ఉత్సవమూర్తులకు పసుపు, కుంకు మ అర్పించి ప్రజలందరిపై చల్లని దీవెనలు కురిపించాలని వేడుకున్నారు.






