calender_icon.png 2 August, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి

13-12-2024 02:40:28 AM

  1. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి
  2. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి):  రాష్ట్రంలోని బీజేపీ నేతలకు తెలంగాణపై ప్రేమ ఉంటే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ర్ట ప్రభుత్వానికి గురువారం ఒక ప్రకటనలో సూచించారు.

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించడం బాధాకరమన్నారు. రాష్ర్టం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయమన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని, ఇప్పుడు ఆయన కూడా మాట్లాడటం లేదని విమర్శించారు.

2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగిస్తే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. 

కవితను కలిసిన పలు సంఘాల నేతలు

సగర, వంశరాజుల సంఘాల నాయకు లు కవితను ఆమె నివాసంలో వేర్వేరుగా కలిశారు. డెడికేటెడ్ కమిషన్‌కు బీసీ కులగణన పై నివేదిక సమర్పించినందుకు కృతజ్ఞ తలు తెలియజేశారు. తమ సమస్యలపై శాసనమండలిలో ప్రస్తావించాలని సగర సం ఘం రాష్ర్ట అధ్యక్షుడు విజయేందర్‌సాగర్ కోరా రు. తమను బీసీ నుంచి బీసీ కి మార్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో బొల్ల శివశంకర్, వంశరాజ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు మురళీకృష్ణ, నిమ్మల వీరన్న, సగర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు 

రేపు రౌండ్‌టేబుల్ సమావేశం

రాష్ట్ర సంస్కృతి, అస్థిత్వంపై ప్రభుత్వం దాడి, అధికారిక ఉత్సవాలు, వేదికలపై విష సంస్కృతిని ప్రవేశపెట్టడంపై శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృ తి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. మేధావు లు, కళాకారులు, కవులు, రచయితలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు పాల్గొననున్నారు.