వడదెబ్బతో బర్రెల కాపరి మృతి
23-05-2026 03:56 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం పెద్దనపల్లి గ్రామానికి చెందిన ఓ బర్రెల కాపరి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దనపల్లి గ్రామానికి చెందిన పోలగాని వెంకటేష్ బర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. బర్రెలను మేపడానికి వెళ్లిన వెంకటేష్ తిరిగి ఎండ సమయంలో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నీరసం పడి పోయిన ఆయనను కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటినా తీసుకెళ్లారు. వైద్యులు చికిత్సఅందించారు. అందించినప్పటికీ, తీవ్ర వడదెబ్బతో వెంకటేష్ తుది శ్వాస విడిచాడు.






