20-12-2025 12:00:00 AM
మహబూబాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టాలని సీ పీ ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయసారథి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం సిపిఐ దశల వారి పోరాటం చేపట్టనున్నట్లు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే విజయం సాధించిన వార్డు సభ్యులను సన్మానించారు. వచ్చే ప్రాదేశిక ఎన్నికల్లో సిపిఐ పక్షాన అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలుపుతామని ప్రకటించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఐ అనునిత్యం పేద ప్రజల సంక్షేమం, హక్కుల సాధన కోసం పోరాడుతోందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు అజయ్ సారధి రెడ్డి, పాండురంగ చారి, పెరుగు కుమార్, రేషనపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, సందీప్, శేఖర్, స్వామి, లింగ్యా, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.