20-12-2025 12:00:00 AM
చేర్యాల,డిసెంబర్19: చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్లో శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన చేర్యాల,కొమురవెల్లి,మద్దూరు,దూల్మిట్ట మండలాలలోని గ్రామాలకు చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్,వార్డు మెంబర్ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ముఖ్య అతిగా హాజరైన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డుమెంబర్లను అభినదనలు తెలుపుతూ రాష్టంలో జనగామ నియోజకవర్గంలోని 131 గ్రామాలకు గాను 73 గ్రామాలను కైవసం చేసుకున్నామని అన్నారు.
దాదాపుగా అన్ని గ్రామాలలో అధికార పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజలు మనవైపే వున్నారని ఇదే స్పూర్తితో వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.