13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

విద్యార్థినుల క్రీడా అభివృద్ధికి ముందడుగు

08-01-2026 12:23 AM

బేగంపేట్ ఉమెన్స్ కాలేజ్లో సంసద్ ఖేలో మహోత్సవ్ చర్చలు

సనత్‌గర్, జనవరి 7 (విజయక్రాంతి):- కేంద్ర మంత్రి మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్‌రెడ్డి సూచనల మేర కు, బుధవారం బేగంపేట్ ఉమెన్స్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ సుప్రియని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి సంసద్ ఖేలో మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కాలేజ్ విద్యార్థినులు వివిధ క్రీడా టోర్నమెంట్లలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించాలని ఆహ్వా నం అందించారు. దీనికి స్పందించిన సుప్రియ, విద్యార్థినులతో జట్లను సిద్ధం చేసి టోర్నమెంట్లలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షుడు మహేష్, జిల్లా నాయకుడు సి. విజయ్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు టి. శ్రవణ్, బాబు రావు పాల్గొన్నారు.