calender_icon.png 7 February, 2026 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు సమ్మె నోటీసు

07-02-2026 12:00:00 AM

12న భారత జాతీయ సమ్మెకు సిఐటియు పిలుపు

జూబ్లీహిల్స్,ఫిబ్రవరి 6(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12వ తేదీన భారత జాతీయ సమ్మెను నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బోరబండ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వాణిశ్రీని సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం  కలిశారు. సమ్మె నేపథ్యంలో అందు కు సంబంధించిన నోటీసును అందజేశారు.

అనంతరం ప్రజా సంఘాల నాయకుడు టి. సాయి శేషగిరిరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులు తమ ప్రాథమిక హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 12వ తేదీన హైదరాబాద్లోని ఆర్టీసీ భవన్ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్వహించే భారీ ర్యాలీలో జిహెచ్‌ఎంసి కార్మికులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోన్ సిఐటియు నాయకులు రాపర్తి అశోక్, భవన నిర్మాణ కార్మిక సంఘం జూబ్లీహిల్స్ జోన్ నాయకులు జాకటి స్వామి, దిలీప్, సికిందర్‌లున్నారు.