calender_icon.png 8 February, 2026 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో

07-02-2026 12:00:00 AM

బూర్గంపాడు,ఫిబ్రవరి 6(విజయక్రాంతి): మండల కేంద్రమైన బూర్గంపాడులో అంగన్వాడీ కేంద్రం-4ను భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీస్కూల్ విద్య, కేంద్రంలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గర్భిణులకు ఐటీసీ, ఎల్డీడీ, ఎనీవో, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకపదార్ధాలు కలిగిన ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పద్మ, సుమిత్ర, ఎల్డీడీ సిబ్బంది ప్రమీల, అభిషేక్ లు పాల్గొన్నారు.