18-12-2025 12:00:00 AM
రాయికోడ్(మునిపల్లి), డిసెంబర్ 17 : ట్రాక్టర్‌తో పొలంలో చదును చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు ట్రాక్టర్ పై పడడంతో షాక్కు గురై డ్రైవర్ మృతి చెందిన సంఘటన రాయికోడ్ మండలం జమాల్ పూర్ గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్ గ్రామానికి చెందిన బర్దిపూర్ జగన్ (18) అనే విద్యార్థి రాయికోడ్ లోని మోడల్ ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.
అయితే ప్రస్తుతం మూడో విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పాఠశాలకు సెలవు ఉండడంతో ఖాళీగా ఉండలేక తనకు తెలిసిన ఓ ట్రాక్టర్ పై డ్రైవింగ్ చేసేందుకు వెళ్లాడు. కాగా జమాల్ పూర్ గ్రామంలో గల ఓ ఫౌంహౌస్ లో ట్రాక్టర్ తో పత్తి చేను చదును చేస్తున్న క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంబానికి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తాకడంతో విద్యుత్ వైర్లు, స్తంభం ఒక్కసారిగా ట్రాక్టర్ పై పడ్డాయి.
దీంతో జగన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృ తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికోడ్ పోలీసులు తెలిపారు.