calender_icon.png 19 December, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయోత్సవ ర్యాలీలకు అనుమతిలేదు

18-12-2025 12:00:00 AM

ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, డిసెంబర్ 17 : మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, పోలింగ్ 87.43 శాతంగా నమోదు అయినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వివరించారు. ఆయా గ్రామాలలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. అయితే గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలకు, డీజేలకు అనుమతి లేదని, ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.