calender_icon.png 19 December, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రుల శాఖ ఉండాలి

18-12-2025 12:00:00 AM

  1. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
  2. దేశవ్యాప్తంగా ఫీజు  రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలి
  3. తెలంగాణ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ
  4. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

ముషీరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రి త్వ శాఖను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద తెలంగాణ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ  ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు.

సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 79 ఎడ్ల స్వతంత్ర భారతదేశంలో 70 కోట్ల జనాభా కలిగిన బీసీలకు ప్రాతినిధ్యం లేకపోవడం అన్యాయమన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతోనే బీసీలకు సామాజిక న్యాయం దక్కుతుందన్నారు.  ఈ దేశంలో బీసీలకే అనేకమైన ఆంక్షలున్నాయని మండిపడ్డారు. విద్య ద్వారానే ఈ దేశ సమగ్ర అభివృద్ధి చెందుతుందన్నారు.  

భారతదేశం అగ్ర దేశంగా మారాలంటే

వంద శాతం అక్షరాస్యతతోనే సాధ్యమన్నారు.  విద్యకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ మాట్లాడుతూ ఫీజు  ఫీజు రీయింబర్స్మెంట్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయకుండా ప్రభుత్వం మీన వేషాలు వేస్తుందన్నారు.

ఫీజు బకాయిలను వెంటనే చెల్లించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు.  లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాజుల లింగం గౌడ్ బీసీ జేఏసీ కన్వీనర్, కవుల జగన్నాథం, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.