10 August, 2026 | 2:56 AM

మహిళా రిజర్వేషన్లలో బీసీలకు సబ్ కోటా కల్పించాలి

10-08-2026 01:54 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, మిరియాల యాదగిరి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా రి జర్వేషన్లో బీసీ మహిళలకు ప్రత్యేక వాటా లే కుంటే సామాజిక న్యాయం అసంపూర్ణంగా మిగులుతుందని అన్నారు. అలాగే తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.

బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం, బీసీ విద్యార్థులకు విద్యా భరోసా కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షు లు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ మహిళలకు అన్ని స్థాయిల్లో రాజకీయ అవకాశాలు పెరగాలని కోరారు. మిరియాల యాదగిరి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు వెంకటేశ్వర్లు, విజయ్, ధనుంజయ, హరిబాబు, కీర్తి శ్రీనివాస్, శ్రీనివాసాచారి, భీష్మాచారి, మల్లెబోయిన సతీష్ యాదవ్, దీకొండ శ్రీనివాస్, కాళ్ల భద్రయ్య, రాపోల్ సత్యనారాయణ, అండెం తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.