10 August, 2026 | 3:01 AM

ఆయిల్‌ఫామ్‌తో రైతులకు అధిక ఆదాయం

10-08-2026 01:55 AM

మూడు ఎకరాల్లో నెలకు లక్ష వరకు ఆదాయం: హరీశ్‌రావు

సిద్దిపేట రూరల్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఆయిల్పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం లభిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. నారాయణరావుపేట మండలం గోపాలపూర్లో రైతు సోప్పరి రవి భూమిలో ఆయన ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల్లో ఆయిల్ప్పా నమ్మకం పెరుగుతోందని అన్నారు. గోపాలపూర్లో 54 మంది రైతులు 120 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

కొందరు రైతులు 2 నుంచి 5 ఎకరాల్లోనే 5 టన్నుల నుంచి 30 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో సుమారు 5 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు జరుగుతుండగా, ఇప్పటికే 3,100 ఎకరాల్లో కోత దశకు చేరుకుందని చెప్పారు. ఇక్కడ ఆయిల్పామ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. వరి సాగుతో పోలిస్తే ఆయిల్పామ్లో సమస్యలు తక్కువగా ఉండి నెలనెలా ఆదాయం వస్తుందని హరీశ్రావు పేర్కొన్నారు. మూడు ఎకరాల్లో సక్రమంగా సాగు చేస్తే నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. యువత, రైతులు ఈ పంట వైపు ఆకర్షితులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.