25-08-2025 01:23:12 AM
భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరావు
భద్రాచలం, ఆగస్టు 24, (విజయ క్రాంతి):పార్వతీదేవి అమ్మవారు శరీరం శుభ్రం చేసుకున్న నలుగు మట్టి నుండి వినాయకుడు ఉద్భవించాడని మన పురానాలు చెబుతున్నాయని భద్రాచలం కుమ్మర సంఘం శ్రీ మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అన్నారు. ఆదివారం మట్టి గణపతుల విగ్రహాలనే పూజించండి అనే కరపత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉన్నది... లేకుంటే ప్రకృతి ప్రళయానికి ఎవరైనా శిరస్సు వంచాల్సిందే అన్నారు. పర్యావరణ పరిరక్షణ భావితరాల సంరక్షణ పర్యావరణాన్ని పరిరక్షిద్దాం భావితరాలను సంరక్షిద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ భద్రాచలం సభ్యులు గంగాధర వీరయ్య, భద్రాచలం కుమ్మరి సంఘం డివిజన్ నాయకులు విజ్జిగిరి రాజా కిరణ్, గంగాధర సతీష్, సద్దనపు సత్యనారాయణ, వి. నరేష్, జల్లారపు సునీల్, సగ్గెం లక్ష్మణరావు, రెల్లి తాతారావు, కొలిచలం నవీన్, విజ్జిగిరి రవి తేజ తదితరులు పాల్గొన్నారు.