20-01-2026 02:10:24 AM
గజ్వేల్ బిఆర్‌ఎస్ ఇంచార్జ్ బూరుగుపల్లి ప్రతాపరెడ్డి
తూప్రాన్, జనవరి 19 :తూప్రాన్ మున్సిపల్ పరిధి 4వ వార్డు క్రిందివాడ కట్టులో బిఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి గజ్వేల్ ఇంచార్జ్ బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి హాజరై పార్టీ జెండ ఆవిష్కరించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తూప్రాన్ మున్సిపల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని దీంట్లో భాగంగా ప్రత్యేక మున్సిపల్ భవనాన్ని నిర్మించామన్నారు.
మున్సిపల్ ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయి యోచనలో ఎన్నో సంవత్సరాల కల సహకారం చేస్తూ రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల రోడ్డును వైశాల్యం చేసి సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రధాన రహదారి మధ్య భాగంలో డివైడర్ నిర్మాణం చేసి హైమస్ట్ లైట్లను నిర్మించిందన్నారు. పలు వీధుల్లో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. పెద్ద చెరువు కట్ట మరమ్మత్తులతో పాటు సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ చేపట్టడం జరిగిందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అన్ని వసతులను బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో చేయడం జరిగిందన్నారు. కానీ గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తూప్రాన్ లో ఎలాంటి అభివృద్ధిని చేపట్టలేదని ఎద్దేవ చేశారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థులకు చెంపపెట్టు దెబ్బ ఓటు ద్వారా చూపెట్టాలని గుర్తు చేశారు. నాలుగో వార్డ్ ఎస్టి రిజర్వుడు కావడంతో జైపాల్ రాథోడ్ ను నాలుగో వార్డ్ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇందులో బి ఆర్ ఎస్ ఎన్నికల ఇన్చార్జ్ వేణుగోపాల్ రెడ్డి, శివంపేట్ సీనియర్ నాయకులు కల్లూరి హరికృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, షలాకా రాజు పంతులు, మనోహరాబాద్ మండల టిఆర్‌ఎస్ నాయకులు వెంకట్ గౌడ్, పంజా బిక్షపతి, పూల అర్జున్ యాదవ్, తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షుడు సతిష్ చారి, మాజీ కౌన్సిలర్లు, దుర్గారెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, రాజీ రెడ్డి, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.