27 July, 2026 | 6:51 AM

దిక్కులేదు.. మొక్కులేదు!

31-05-2024 12:05 AM

కామారెడ్డి, మే ౩౦ (విజయక్రాంతి) : కొత్త సాగు పద్ధతులు, కొత్తకొత్త వంగడాలు, సాగులో మెళకువలు లాంటి విషయాల్లో రైతులకు అవగాహన కల్పించాలనే లక్ష్యం తో అరకోటి రూపాయలు పెట్టి కామారెడ్డిలో రైతుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. సర్కారు లక్ష్యం, అధికారుల ఆలోచన బాగా నే ఉన్నా ఆచరణలో మాత్రం అలసత్వం కొనసాగుతోంది. ఎనిమిదేళ్ల క్రితం  జిల్లా కేంద్రంలోని పాతరాజంపేట శివారులో విజయ పాల డెయిరీ ఆవరణలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ నిరుపయోగంగానే మిగిలిపోతోంది.  ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో పాలకవర్గాన్ని నియమించినా రైతుల ప్ర యోజనం కోసం పట్టించుకునే వారే కరువయ్యారు. ఆత్మ పథకం నిధులతో వ్యవసా య క్షేత్రాల సందర్శన పేరిట విహార యాత్రలతో ఎంజాయ్ చేస్తున్న కమిటీ సభ్యులు.. రైతులకు తగిన సమాచారం, సలహాలు అందించే శిక్షణ తరగతుల పట్ల మాత్రం శ్రద్ధ చూపకపోవడం వారి నిర్లక్ష్యాన్ని, రైతుల పట్ల చిత్తశుద్ధిని ఎత్తిచూపుతోంది.