మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం సమస్యలు
పరిష్కరించాలని సీఎంకు పోస్టు కార్డులు
మంచిర్యాల, మే 30 (విజయక్రాంతి): బీసీల న్యాయమైన డిమాండ్లు, సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డులను గురువారం పోస్టుచేశారు. బీసీ ఫెడరేషన్‌లకు పాలక మండలి ఏర్పాటు చేసి చట్టభద్రత కల్పించాలని, కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లకు రూ.౨వేల కోట్ల నిధులు విడుదల చేయాలని, లక్ష కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతంరిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తేవాలని తదితర డిమాండ్లతో కూడిన కార్డులను పోస్ట్ చేశారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, డాక్టర్ రఘునందన్, తులా మధుసూదన్, కర్రె లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా
సూర్యాపేట, మే 30 (విజయక్రాంతి): మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన సాధించడమే ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ వెంకటరావు, అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి సందర్శిం చారు. అక్కడ ఉపాధి పొందుతున్న మహిళలతో మాట్లాడారు.
మహిళా సంఘంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం 70 లక్షల జతల యూనిఫాం సిద్ధం చేయిస్తున్నామన్నారు. నెలన్నర నుంచి మహిళలు వాటిని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారని కొనియాడారు. జిల్లాలోని 783 పాఠశాలల్లో చదువుతున్న 43,245 మంది విద్యార్థుల యూనిఫాం ఇక్కడే సిద్ధం చేయిస్తున్నామని కలెక్టర్ వెంకటరావు అ న్నారు. ఇప్పటివరకు 31,940 మందికి సరిపడా యూనిఫాం సిద్ధమైందన్నారు. పర్యట నలో డీఆర్‌డీవో మధుసూదన్‌రాజు, సీఈ వో అప్పారావు, డీఈవో అశోక్ ఉన్నారు.






