27 July, 2026 | 8:00 AM

ఆధార్ అప్డేట్ కోసం తిప్పలు

31-05-2024 12:05 AM

బెల్లంపల్లి, మే 30: బెల్లంపల్లి పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఆధార్ అప్డేట్ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. మీ సేవా కేంద్రం వద్ద ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఎండను కూడా లెక్క చేయకుండా మీసేవా కేంద్రం వద్ద క్యూలో నిలబడుతున్నారు. మీసేవా కేంద్రం వద్ద ప్రజలకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నారు.