మాది ప్రజా ప్రభుత్వం
హామీలను తప్పక నెరవేరుస్తాం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ ౧౧ (విజయక్రాంతి): తమది ప్రజాప్రభుత్వమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఐడీవోసీలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడా రు. జిల్లాలోని ఎమ్మెల్యేల సమన్వయంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, జిల్లా అభివృద్ధికి దోహదపడాలని అధికారులను ఆదే శించినట్టు తెలిపారు.
ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం రూ.39వేల కోట్లతో ఏర్పాటు చేసిన మిషన్‌భగీరథ పనులు క్షేత్రస్థాయిలో అధ్వానంగా ఉన్నాయని, వాటిని పునరుద్ధరించి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిం చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ఏర్పాటుకు అడవులు అడ్డొస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిషు మీడియంలో బోధన చేసేందుకు చర్యలు తీసు కుంటున్నట్లు వెల్లడించారు. ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న 2.50లక్షల దరఖాస్తులను పరిష్కరిస్తామని చెప్పారు.
అందుబాటులో నాణ్యమైన విత్తనాలు
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచామని, పంటలకు సరిపడా ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కోతలు మొదలయ్యాయి, విత్తనాలు అందక రైతులు రోడ్డు ఎక్కుతున్నారంటూ విపక్షాలు గ్లోబెల్ ప్రచారం చేస్తున్నాయని అదంతా అబద్ధమని మంత్రి నొక్కిజెప్పారు. ప్రజలు కోరిన తీరుగా పాలన అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడి ్డ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, మాలోత్ రాందాస్ నాయక్, కలెక్టర్ ప్రియాంక, ఐటీడీఏ పీవె ప్రతీక్‌జైన్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గతంలోలా పనిచేస్తే సహించం
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమని, గత ప్రభుత్వంలో మాదిరిగా అధికారులు పనిచేస్తే సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికా రులను హెచ్చరించారు. మంగళవారం భద్రాద్రి కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అధికారులంతా బాధ్యతతో విధులను నిర్వర్తించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సుందరీకరణకు రూ.650 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు.
అప్రకటిత విద్యుత్తు కోతలను విద్యుత్తుశాఖ అధికారులు నివారించి, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. ధరణి పోర్టల్‌లోని పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరం అందించేలా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. అధికారులందరూ తమ శాఖ పరిధిలోని సమగ్ర నివేదికలతో ప్రతినెలా నిర్వహించే జిల్లాస్థాయి సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు.






