calender_icon.png 23 November, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమెన్ సెఫ్టీ వింగ్‌కు సన్మానం

28-07-2024 02:12:50 AM

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): మహిళల భద్రత, సత్వర న్యాయాన్ని అందించడంలో అత్యుత్తమ పనితీరును  కనబర్చిన ఉమెన్ సెఫ్టీ వింగ్ అధికారులను అడిషనల్ డీజీపీ కార్యాలయంలో శనివారం సన్మానించారు. మహిళలకు సత్వర న్యాయం అందించే ఉద్దేశంతో అడిషనల్ డీజీపీ శిఖగోయల్ నాయకత్వంలో ఉమెన్ సెఫ్టీ వింగ్ పనిచేస్తోంది. చట్టాల్లోని నిబంధనలను సమర్థవంతంగా నివియోగించుకొని బాధితులకు న్యాయం చేయా లని ఆమె విజ్ఞప్తిచేశారు. సన్మానించిన వారిలో పోలీసు అధికారులు శేఖర్‌రెడ్డి, ప్రమీల తదితరులు ఉన్నారు.