28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

కుటుంబ కలహాలతో ఓ మహిళ అదృశ్యం

18-06-2025 07:08 PM

ఘట్ కేసర్: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఇంటి నుంచి వెళ్లిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఘట్ కేసర్ పట్టణంలోని కృష్ణమార్ట్ వెనకాల కంచుకం వెంకటేష్, అతని భార్య నందిని(24) ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం సుమారు 1 గంటలకు ముగ్గురు పిల్లలను, ఇల్లు వదిలి నందిని వెళ్లి పోయింది.

దీంతో భర్త వెంకటేష్ మూడురోజుల పాటు బంధుమిత్రుల వద్ద ఆరా తీసిన తన భార్య ఆచూకీ లభించలేదు. కుటుంబ కలహాలు కారణంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటుందని, భర్త వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అదృశ్యమైన మహిళ వివరాలు తెలిసినవారు 8712662705, 8712580183 సంప్రదించి సమాచారం అందించాలని ఎస్ఐ సాయికుమార్(SI Saikumar) తెలిపారు.