16 July, 2026 | 1:40 AM

రేపు లోక్ అదాలత్

07-06-2024 02:29 AM

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): జాతీయ లోక్‌అదాలత్ ఆదేశాల మేరకు శనివారం తెలంగాణలోని అన్ని స్థాయి కోర్టుల్లో లోక్ అదాలత్‌లు నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి సివిల్ కోర్టుల వరకు కక్షిదారులు (వాదప్రతివాదులు) ఉభయుల అంగీకారంతో తమ కేసులను లోక్‌అదాలత్‌లలో రాజీ చేసుకోవచ్చునని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు సంబంధిత కోర్టులో సంప్రదించవచ్చని చెప్పారు.