02-01-2026 12:00:00 AM
కాకతీయ యూనివర్సిటీ, జనవరి 1(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ ఫెస్టివల్ ఈ నెల 6న మంగళ వారం ఉద యం 8.00 గంటల నుంచి కాకతీయ విశ్వవిద్యాలయ ఆరట్స్ అండ్ సైన్సు కాలేజీ ఆడి టోరియం లో నిర్వహించనున్నారు. దీనికి సంబందించిన గోడ పత్రిక ను వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచా ర్య వి. రామచంద్రం తో కలిసి ఆవిష్కరించారు. ఆసక్తి ఉన్న వాలంటీర్,లు లిటరరీ, క్రి యేటివ్, పెర్ఫార్మింగ్ ఆరట్స్, ఎగ్జిబిషన్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, విజేతలకు బహుమతుల ప్రధానం అదే రోజు ఉం టుందన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పధకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ, యూనివర్సిటీ ఆరట్స్ అండ్ సైన్సు కాలేజీ ప్రిన్సిపాల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. జ్యోతి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ఆచార్య మామిడాల ఇస్తారి, డాక్టర్ కే. ఐలయ్య, ప్రోగ్రాం ఆఫీసర్స్ సుంకరి. శ్రీదేవి, ఎ.రమేష్, ఎ. శ్రీలత పాల్గొన్నారు.