calender_icon.png 10 January, 2026 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి

02-01-2026 12:00:00 AM

హనుమకొండ టౌన్, జనవరి 1 (విజయక్రాంతి): అంతర్జాతీయ చెస్ వేదికపై భారతీయ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వరల్ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకం సాధించి భారతదేశానికి కీర్తి తీసుకువచ్చిన అర్జున్ ఇరిగేసిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాం క్షించారు.

అనంతరం అర్జున్ కు నూతన సం వత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వారి తల్లిదండ్రులు డాక్టర్ ఇరిగేసి జ్యోతి శ్రీనివాసరావు లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొ సైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఇ.వి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.