10-01-2026 02:16:19 PM
హైదరాబాద్: నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్ కు నిరసనగా బీజేవైఎం చలో అశోక్ నగర్(Chalo Ashok Nagar) కు పిలుపునిచ్చింది. బీజేవైఎం ఆందోళన నేపథ్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ – చిక్కడపల్లి(Hyderabad - Chikkadpally) లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను పోలీసులు నిర్బంధించారు. తమను నమ్మించి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారంలోకి వచ్చాడని నిరుద్యోగులు ఆరోపించారు. జాబ్ క్యాలెండర్(Job Calendar), 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసన తెలిపారు.