10-01-2026 02:42:16 PM
హైదరాబాద్: పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే నగర ప్రజలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్(Hyderabad CP Sajjanar) కీలక హెచ్చరిక చేశారు. ''సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఇంటి భద్రత మరువకండని సూచించారు. పండుగ వేళ దొంగల కన్ను తాళం వేసిన ఇళ్లపైనే ఉంటుందని తెలిపారు. నగదు, ఆభరణాలు బ్యాంక్ లాకర్లలో దాచుకోండి. సోషల్ మీడియాలో ట్రావెల్ అప్‌డేట్స్ పెట్టొద్దని హెచ్చరించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానం వస్తే డయల్ 100 కి కాల్ చేయాలని తెలిపారు. 'మీ భద్రతే మా బాధ్యత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు' అంటూ సజ్జనార్ ఎక్స్ లో పోస్టు చేసిన వీడియో సందేశంలో వెల్లడించారు.