calender_icon.png 11 January, 2026 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగు, తాగు నీటి సమస్య పరిష్కారానికి మంత్రి భరోసా

10-01-2026 02:04:49 PM

డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్...

ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ప్రజల సాగునీరు, తాగునీరు సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా కల్పించారని ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ తెలిపారు. శనివారం హైదరాబాదులో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ రెడ్డితో కలిసి మంత్రిని కలిసిన సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు ముఖ్యమైన నీటి సమస్యలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా మంత్రితో చర్చ జరిగిందన్నారు.

ముఖ్యంగా కుప్టి ప్రాజెక్టు, చనకా- కొరట ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనుల మంజూరుకు సంబంధించి వినతిపత్రాన్ని మంత్రివర్యులకు అందజేశామన్నారు. ఈ విషయాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి వసతుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారన్నారు. సంబంధిత ప్రాజెక్టులకు అవసరమైన మంజూరులు ఇచ్చి, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.