04-08-2024 02:40:37 AM
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో 8మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, హౌసింగ్, ఆర్‌అండ్‌బీ, జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ వికాస్ రాజ్‌ను ప్రభుత్వం నియమించింది. పార్లమెంట్ ఎన్నికల వరకు వికాస్‌రాజ్ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నారు. ఎన్నికల అనంతరం ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్న టీ శ్రీదేవి.. ఎస్సీ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. శ్రీదేవి స్థానం లో కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా సయిద్ అలీ ముర్తాజా రిజ్వీకి ప్రభు త్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఆర్‌అండ్‌బీ జాయింట్ సెక్రట రీగా ఉన్న హరీశ్‌కు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రటరీగా అదనపు బా ధ్యతలను అప్పగించారు. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్‌మెంట్ జా యింట్ సెక్రటరీగా ఉన్న పీ ఉదయ్ కుమార్‌కు.. మార్కెటింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. సూర్యాపేట అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న చెక్కా ప్రియాంక.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీగా నియామకమయ్యారు. కోఆప రేషన్ డిపార్ట్‌మెంట్ జాయింట్ రిజిస్టార్‌గా ఉన్న కే చంద్రశేఖర్ రెడ్డిని హైదరాబాద్, హెచ్‌ఏసీఏ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం ట్రాన్సఫర్ చేసింది. వరంగల్ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని మార్క్‌ఫెడ్ ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది.