calender_icon.png 26 August, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

26-08-2025 02:12:35 PM

పరమేశ్వర్ రెడ్డి..

ఉప్పల్ (విజయక్రాంతి): మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఉప్పల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి(incharge Mandumula Parameshwar Reddy) అన్నారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో నాచారం ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ నాయకులు విఎస్ ప్రకాష్ రెడ్డి మామిడాల సంతోష్ రెడ్డి రాజిరెడ్డి మెతుకు శ్రీనివాస్ రెడ్డి మహంకాళి అమ్మవారి దేవాలయం చైర్మన్ సేవాదళ్ పాల్గొన్నారు.