26-08-2025 02:09:49 PM
నల్గొండలో వాడి వేడి రాజకీయం.?
యాడ్ బోర్డ్ లను తొలగింపు
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా ఉంది నల్లగొండ రాజకీయం. సోమవారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Former MLA Kancharla Bhupal Reddy) జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. జన్మదిన వేడుక సందర్భంగా నల్లగొండలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదేరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) పట్టణమంతా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఫ్లెక్సీలతో గులాబీమయం అవ్వటంతో అధికారులపై ఫైర్ అయ్యారు. వెంటనే ఫ్లెక్సీలతో పాటు కాంట్రాక్టర్ ఏర్పాటుచేసిన యాడ్ బోర్డులను మంగళవారం మున్సిపల్ శాఖ అధికారులతో వెంటనే తొలగించాడు.