calender_icon.png 4 July, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలీలో దహాగా ఆమిర్‌ఖాన్

04-07-2025 12:00:00 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజాచి త్రం ‘కూలీ’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ స్టార్ నాగార్జున, బాలీవు డ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, మహేంద్రన్ వివిధ పాత్రల్లో నటిస్తున్నారు.

డీ సురేశ్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యం లోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటె డ్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు పాత్రలను పరిచయం చేసిన చిత్రబృందం గురువారం ఆమిర్‌ఖాన్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది.

ఆయన క్యారెక్టర్‌ను ‘దహా’గా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేమ్ ఉన్న గ్లాసెస్ ధరించి సిగార్ తాగుతూ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు ఆమిర్. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్; సినిమాటోగ్రఫీ: గిరీశ్ గంగాధరన్; ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్.