calender_icon.png 5 July, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాలీవుడ్‌లో అరుదైన గౌరవం

04-07-2025 12:00:00 AM

బాలీవుడ్ అగ్రతార దీపికా పడుకొణె కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు దీపిక పడుకొణె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా ప్రకటించింది. దీపికను మోషన్ పిక్చర్స్ కేటగిరీలో ఎంపిక చేశారు. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటి దీపికనే కావడం విశేషం.

డెమీ మూర్, రాచెల్ మెక్ ఆడమ్స్, స్టాన్లీ టక్కీ, ఎమిలీ బ్లంట్ లాంటి హాలీవుడ్ నటులు సహా ఈ అవార్డు కోసం ఛాంబర్ ఎంపిక చేసిన మొత్తం 35 మంది టాలెంటెడ్ సెలబ్రిటీల్లో దీపిక ఒకరు. వినోద రంగంలో విశేష కృషికి గాను వీళ్లకు ఈ ఘనత దక్కింది. నటనతోనే కాకుండా ప్రసంగాలతోనూ ఆకట్టుకోవడం దీపిక పడుకొణె ప్రత్యేకత. 2018లో టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘100 మంది ఇన్‌ఫ్లూయెన్షి యల్ పీపుల్’ లిస్టులో చోటు దక్కించుకున్నారామె.

2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను ఆవిష్కరించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. 2023లో ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది కూడా దీపికానే. 2006లో సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన దీపికా 2017లో ‘ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’తో హాలీవుడ్ తెరపై మెరిశారు. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమాలో కథానాయికగా నటిస్తున్న దీపికా ఆ తర్వాత ‘కల్కి2’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.