calender_icon.png 18 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు

18-09-2025 12:54:49 AM

  1. ప్రభుత్వం బకాయిలు ఇచ్చేవరకు సేవలు బంద్

చికిత్సలు కొనసాగించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి

కరీంనగర్, సెప్టెంబర్17(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 150 కి పైగా ప్రై వేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీ సేవలను బుధవారం నుండి నిలిపి వేశారు. ప్రభుత్వం నుంచి రూ. 1400 కోట్ల బకాయిలు చెల్లించాలినే డిమాండ్ తో సేవ లు నిలిపి వేశారు. అయితే చెలిమడ, ప్రతి మ, అపోలో రీచ్, మెడ్ కవర్ ఆసుపత్రుల్లో అలాగే ఒమేగా క్యాన్సర్ ఆసుపత్తిలో ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించారు.

సేవలు నిలిపివేత పై వెనక్కి తగ్గాలి:రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సేవలు నిలిపివేత పై వెనక్కి తగ్గాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా ప్రైవేట్ హాస్పిటల్ యాజన్యాలకు విజ్ఞప్తి చేశారు.ఆరోగ్య శ్రీ నిలివివేయడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారన్నారు.మానవీయ కోణంలో హాస్పిటల్ యాజమాన్యాలు ఆరో గ్య శ్రీ సేవలు పునరుద్ధరించాలన్నారు .

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితి ఐదు లక్షల నుండి పది లక్షల పెంచడంతోపాటు గడిచిన 21 నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా 1779 కోట్ల రూపాయలను ఆరోగ్య శ్రీ కింద ప్రైవేట్ హాస్పిటల్ లకు ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.

మా మంత్రి దామోదర రాజనర్సింహ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారన్నా రు. ఇప్పటికే రెండు రోజుల్లోనే 100 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్ లకు విడుదల చేశారని. ఆ డబ్బులు హాస్పిటల్ ఖాతాలో జమ అయ్యాయని పెండింగ్ డబ్బులు విడతల వారిగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నార మానవీయ కోణంలో వెంటనే ఆరోగ్య శ్రీ సేవలను పునరుద్ధరించాలని విజ్ఞప్తిచేశారు.