8 March, 2026 | 10:24 AM

అలైన్‌మెంట్ మార్చాలని ట్రిపుల్ ఆర్ బాధితుల ధర్నా

18-09-2025 12:53 AM

సంస్థాన్ నారాయణపూర్,సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): ట్రిపుల్ ఆర్ బాధిత రైతుల నిరసన రోజు రోజుకు పెరుగుతోంది.శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు రహదారులు దిగ్బంధనం చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.తమకున్న ఎకరం రెండెకరాల భూమి మొత్తం రోడ్డుకు పోతే తమకు చావే శరణ్యం అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.అలైన్మెంట్ మార్చి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బుధవారం సంస్థాన్ నారాయణపూర్ మండలం గుడిమాల్కాపూర్ గ్రామంలో నారాయణపూర్ చౌటుప్పల్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బిజెపి నారాయణపురం మండల కమిటీ మద్దతు తెలిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలైన్మెంట్ మార్చే వరకు రైతులతో కలిసి పోరాడుతామని భాజాపా మండల అధ్యక్షుడు సుర్విరాజు గౌడ్ తెలిపారు.మూడు రోజులుగా రోజుకో గ్రామంలో రహదారులపై నిరసన తెలుపుతున్నారు.రోడ్డు దిగ్భందనంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా నారాయణపూర్ ఎస్త్స్ర జగన్ నేతృత్వంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు.