18-09-2025 12:54:52 AM
నేరేడుచర్ల: నేరేడుచర్ల పట్టణం లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం సందర్భంగా బుధవారము అత్యంత భక్తి శ్రద్ధలతో పంచామృతాభిషేకాలు చేశారు. ఆలయ పూజారి బృందావనం శ్రీరామ నరసింహ తేజ ఆధ్వర్యంలో ఆలయం మండపంలో ఉత్సాహ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి విశ్వక్సెన పూజ, పుణ్యాహవాచనము, అర్చన, పంచామృతాభిషేకాలు అత్యంత వైభవంగా వేదమంత్రాలతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొణతం సత్యనారాయణ రెడ్డి, తాటికొండ వెంకటరెడ్డి, మాశెట్టి సైదయ్య, చిత్తనూరి సత్యనారాయణ, కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, రవీందర్ రెడ్డి,మహిళలు తదితరులు పాల్గొన్నారు.