calender_icon.png 8 November, 2024 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

15-10-2024 04:58:42 PM

మందమర్రి (విజయక్రాంతి): మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మహంత్ అర్జున్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మనో వికాస్ పాఠశాల విద్యార్థుల సమక్షంలో మంగళవారం కేక్ కట్ చేశారు. అనంతరం  విద్యార్థులకు కేకు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మహంత్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ.. అక్టోబరు 15, 1931న జన్మించిన కలాం జీవితం దేశం పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకిత భావానికి నిదర్శనం అని అన్నారు. భారతదేశ అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన కృషి అసమానమైనదని ఆయన సేవలు కొనియాడారు. విద్యార్థులు అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొలిపాక సదానందం, వేణు, యువ నాయకులు ఓరుగంటి సురేందర్, మహంత్ కృష్ణ బాబు, రామోజు సాయి తేజ, సాదిక్ లు పాల్గొన్నారు.