calender_icon.png 16 February, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌వి కుయుక్తులు!

16-02-2026 01:27:31 AM

  1. రైతులు, ఎగుమతిదారుల్లో భయాందోళనలు కలిగించేలా వ్యాఖ్యలు
  2. దేశపురోగతిని వెనక్కు లాగేలా కుట్ర 
  3. ట్రేడ్ డీల్‌తో ఎగుమతులు పెరిగి.. ఉపాధి మెరుగు
  4. అధికారం దక్కదన్న అసహనంతో కేంద్రంపై బురద
  5. ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాం తి): భారత్-- వాణిజ్య ఒప్పందంపై విపక్షనేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. రైతులు,  ఎగుమతిదారుల్లో అనవసర భయాందోళనలు కలిగించేందుకే కు యుక్తులు పన్నుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నెగటివ్ రాజకీయాల ద్వారా.. దేశ పురోగతిని వెనక్కు లా గేందుకు రాహుల్ కుట్రలకు పూనుకున్నారని ధ్వజమెత్తారు వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉండడంతో రాహుల్ చేస్తున్న దుష్ర్పచారాన్ని ప్రజలు అంగీకరించరని పే ర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కిషన్ రెడ్డి ఎక్స్‌వేదికగా రాహుల్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

ప్రస్తుతం భారత్ రూ.4 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేస్తోందని, 38 అభివృద్ధి చెందిన దేశాల పరిధిలో ని 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ద్వారా రూ.45 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ మార్కెట్‌కు అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్ పార్కులను అభివృద్ధి చేస్తోందని తెలి పారు. ఇందులో ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పేరుతో డెవలప్ అవుతోందన్నారు. 

తెలంగాణకూ పెద్దమొత్తంలో లబ్ధి

 అమెరికా, ఇతర దేశాలతో కుదురుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా ఎగుమతులు గణనీయంగా పెరిగి, వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని, దీని వల్ల తెలంగాణకు కూడా పెద్దమొత్తంలో లబ్ధిచేకూరనుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందడం, ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావడం రాహుల్ గాంధీకి ఇష్టంలే దా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒకవైపు పరిశ్రమ ఎగుమతిదారులను,

మరోవై పు పత్తి డిమాండ్ తగ్గుతుందని రైతులను భయపెట్టేందుకు, వారిని ఆందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించా రు. అయితే భారత వస్త్ర పరిశ్రమ రంగంలో విస్తారమైన వృద్ధి అవకాశాలు ఉన్నందున పత్తికి డిమాండ్ నిరంతరం పెరుగుతుందని, దీని ద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. దీంతో భారతీయ పత్తి రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

నాడు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా..

2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేశ ప్ర యోజనాలకు విరుద్ధంగా అనేక అంశాల్లో రాజీపడిన సంగతి అందరికీ తెలుసన్నారు. 2013లో బాలీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ సమావేశంలో ధాన్యం, పత్తిపై కనీస మద్దతు ధర వ్యవస్థను 2017 నాటికి రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందని, అనంతరం నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ‘ఆహార భద్రత’ను దృష్టిలో ఉంచుకుని..

అభివృద్ధి చెందుతున్న దేశాల పబ్లిక్ స్టాక్‌హోల్డింగ్ కార్యక్రమాలను డబ్ల్యూటీవో సవాలు చేయకూడదని ఒప్పం దం కుదిరిందన్నారు. ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఎంఎస్‌పీ ఉం డాలని స్వామినాథన్ కమిటీ సూచించిందని, దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో అంగీకరించలేదని తెలిపారు. కానీ అనంతరం, నరేంద్రమోదీ ప్రభుత్వం ఉత్పత్తి వ్య యాన్ని పరిగణనలోకి తీసుకుని ఎంఎస్‌పీ నిర్ణయించే విధానాన్ని అమలు చేసిందన్నారు. రైతుకు అయ్యే ఉత్పత్తి వ్యయానికి రెట్టింపు ఆదాయం అందించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని తెలిపారు. 

రాహుల్ నిరాశతో..

ఇప్పటివరకు వరుసగా 100 ఎన్నికల్లో వరుస పరాజయాల తర్వాత రా హుల్ గాంధీ నిరాశ, నిసృ్పహలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విమర్శించారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఉన్న వ్యతిరేకతను దే శంపై వ్యతిరేకతగా మలచుకున్నారని, అందుకే.. 11 ఏళ్లుగా దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి జీర్ణించుకోలేక, అధికా రం దక్కదన్న అసహనంతో.. దేశంలో అన్నదాతలను, ఎగుమతిదారులను రెచ్చగొట్టేందుకు విఫలయత్నం చేస్తున్నారని, వీటిని కూడా ప్రజలు తిప్పికొ డతారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.