calender_icon.png 16 February, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవకులమే..

16-02-2026 01:31:26 AM

మేం పాలకులం కాదని ఎప్పుడో చెప్పా

  1. నేనే రాజు.. నేనే మంత్రి అని అహంకారంతో అనలేదు 
  2. మున్సిపల్ ఫలితాల బాధ్యత తీసుకుంటాననే ఉద్దేశంతోనే చెప్పా
  3. వచ్చే ఎనిమిదేళ్లు తామే అధికారంలో ఉంటాం
  4. మరో 20 ఏళ్లు ప్రజా సేవలోనే ఉంటా
  5. నాలుగు నెలల్లో తండాలకు బీటీ రోడ్లు
  6. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 15 (విజయక్రాంతి):  ‘మేం పాల కులం కాదు.. సేవలకులం అని ఎప్పు డో చెప్పా.. నేనే రాజు.. నేనే మంత్రి అనే మాటలను కొందరు కావాలనే వక్రీకరించి, వేరే విధంగా అర్థం చేసుకున్నారు. నేను ముఖ్యమంత్రిని, మున్సి పల్ శాఖ మంత్రిని నేనే.. కాబట్టి మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు పూర్తి బాధ్యత నాదే అని చెప్పే ఉద్దేశంతోనే ఆ మాట అన్నాను. అంతే తప్ప అహంకారంతో కాదు.

గెలిస్తే పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం నాకు తెలియదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పా రు. ఆదివారం హైదరాబాద్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజా రా భవన్‌న్‌లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి  వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

గత పదేళ్లలో లేని విధంగా లక్షలాది కొత్త రేషన్ కార్డులు, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకా లను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 70వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశా మని, ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం మరో 8 ఏళ్లు అధికారంలో ఉంటుంద ని  ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ మాట తప్పిండు..

తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ తప్పాడు. కానీ తా ము అలా చేయలేదు. దళితుడిని స్పీకర్ చేసి అధ్యక్షా అని పిలిచేలా చేశామని తెలిపారు. దళితులకు నాలుగు మంత్రి పదవులు .. స్పీకర్ పదవి ఇచ్చామని తెలిపారు.  వచ్చే 20 ఏళ్ల కాలమంతా పేదల కోసమే పనిచే స్తా అని సీఎం స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్ర భుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో 85 నుంచి 90 శాతం ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు. కొందరు తాము కేవలం పాలించడా నికే పుట్టామని భావిస్తున్నారని, సమాజంలో వెనుకబడిన వారిని పాలనలో భాగస్వాములను చేయాలన్నదే తమ ఆలోచన అన్నారు. 

విద్యే పేదరికానికి మందు..

లంబాడీ బిడ్డలు పేదరికంలో మగ్గిపోవడానికి చదువు లేకపోవడమే ప్రధాన కారణ మని సీఎం అభిప్రాయపడ్డారు. చదువే అన్ని హోదాలను తెచ్చిపెడుతుందని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని పిలుపు నిచ్చారు. 100 నియోజకవర్గాల్లో రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. గిరిజన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకే ఆ వర్గానికి చెందిన అధికారులకు కీలక పోస్టులు ఇచ్చామని గుర్తుచే శారు.

ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో 87 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకే దక్కాయని, దీనిపై ఎవరికైనా అనుమానం ఉంటే లెక్కలు చూసుకోవచ్చని సవాల్ విసిరారు.

సంక్షేమమే మా అజెండా..

ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం కోసం రూ.9000 కోట్లు ఖర్చు చేశామని సీఎం వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.1000 కోట్లతో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నామని, దీనివల్ల గిరిజన మహిళలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 3.15 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తుచేశారు.

తాను స్వయంగా ఒక గిరిజనుడి ఇంటికి వెళ్లి సన్నబియ్యంతో వండిన అన్నం తిన్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో లంబాడీల పాత్ర వెలకట్టలేనిదని, సురేష్ నాయక్, కవిత నాయక్ వంటి వారు ఆత్మబలిదానం చేసుకున్నారని సీఎం స్మరించుకు న్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో, జడ్పీటీసీగా పోటీ చేసినప్పటి నుంచి సీఎం హోదా వరకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. 

తండాలకు బీటీ రోడ్డు, పంచాయతీ భవనం..

 రాష్ర్టంలోని ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని, గ్రామ పంచాయతీ భవనాలు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తాగునీటి ఎద్దడి నివారణకు సోలార్ పంప్ సెట్లు, ట్యాంకులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  నాలుగు నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నానని, ఆలోపే తండాలన్నింటికీ రోడ్ల సౌకర్యం కల్పిస్తామని ప్రకటిం చారు.

తెలంగాణ సమాజంలో అత్యంత కీలకమైన గిరిజన బిడ్డల తలరాతలు చదువు తోనే మారుతాయని, ఆ దిశగా తమ ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి   స్పష్టం చేశారు. మానవ జాతి శాం తి మార్గంలో నడవాలని బోధించిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని, దేశంలోని 15 కోట్ల మంది లంబాడీలకు ఆయన మార్గదర్శి అని కొనియాడారు.

నల్లమలలో సేవాలాల్ క్షేత్రం..

గిరిజన సంప్రదాయాలు దెబ్బతినకుండా, నల్లమల అటవీ ప్రాంతం లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేటాయించిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే సేవాలాల్ జయంతి వేడుకలను అక్కడే జరుపుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ పొ రిక బలరాం నాయక్ పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.